June, 16-2020
మనిషిని రూపాయల్లో కొలిచి,
మనకోసం ఏమైనా చేస్తాడ , చేయగలడా అన్న కోణంలో లెక్కించి,
వాడు దాటిన కృషివంతెనలని తక్కువచేసి,
కాస్త మెదడుని ఉపయోగించి మాట్లాడితే పొగరని,
నిజాలు చెప్తే రెనాగేడ్ అని నిందలు వేస్తే
ఏం చేయాలి వాడు ?
ఒళ్ళంతా నిప్పులు కుమ్మరించుకోవాలా ?
కోట్ల లీటర్ల ఉమ్మును మీపై దుమ్మెత్తిపోయాలా ?
ఇంకెంతమంది ప్రాణాలు బలై పోవాలి మీ పైశాశికత్వానికి?
ఎన్ని కిలోమీటర్ల లోతుల్లో పాతిపెట్టాలి మీ శరీరాల్ని ?
ప్రపంచం మా చుట్టే తిరుగుతుందని , కొమ్ములున్న గుర్రం మా ఇంట్లో ఉందని ,
కార్లు, బార్లు, పైరవీల కలయికతో నిలుపుకున్న జీవితాలు మీవి .......
మీరు పడింది కష్టం అంటే చప్పట్లు కొట్టాలా ?
- Saral